Etela Rajender: మాజీ మంత్రి ఈటలపై కడియం శ్రీహరి ఆగ్రహం

Etela Rajender: కేసుల నుంచి తప్పించుకునేందుకే ఈటల బీజేపీలో చేరారు-కడియం

Sandeep Eggoju
Updated on: 15 Jun 2021 6:36 PM IST
Kadiyam Srihari Fire on Ex-Minister Etela Rajender
X

కడియం శ్రీహరి (ఫైల్ ఇమేజ్)

Etela Rajender: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మండిపడ్డారు. ఈటల బీజేపీలో చేరడం ఆయన వ్యక్తిగతమన్నారు. అయితే వామపక్ష సిద్దాంతాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పార్టీ అధ్యక్షుడు కాకుండా కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మరో వ్యక్తి సమక్షంలో బీజేపీలో చేరడం ఏంటని అన్నారు. ఈటల తన ఆస్తులను కాపాడుకోవడం కోసమే బీజేపీలో చేరారని అనిపిస్తోందన్నారు. తెలంగాణకు బీజేపీ ఏమిచ్చిందని కడియం ప్రశ్నించారు. పేద ప్రజల ఆహార అలవాట్ల మీద కూడా బీజేపీ దాడి చేసిందని, అది తెలిసి కూడా బీజేపీలో ఎలా చేరారని మండిపడ్డారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story