కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి,ఆయన కుమార్తె కావ్య

Congress: కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఆపార్టీ ఇంఛార్జ్ దీప్‌దాస్‌మున్షీ

Jyothi
Published on: 31 March 2024 11:40 AM IST
Kadiyam Srihari and his daughter Kavya joined the Congress
X

కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి,ఆయన కుమార్తె కావ్య 

Congress: తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా వరంగల్‌లో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్నారు. తాజాగా స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న కడియం కావ్య కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆపార్టీ తెలంగాణ ఇంఛార్జ్ దీప్‌దాస్‌మున్షీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

గతకొంత కాలంగా వరంగల్ రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యను బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది. అయితే.. ఇప్పటికే రెండు పర్యాయాలుగా వరంగల్ బీఆర్ఎస్ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్‌కు ఈ సారి బీఆర్ఎస్ మొండిచేయి చూపింది.

ఈసారి కూడా తనకే టికెట్ వస్తుందని ఆశించి భంగపడ్డ దయాకర్.. మనస్తాపానికి గురై.. కాంగ్రెస్‌తో టచ్‌‌లోకి వెళ్లారు. సంప్రదింపుల అనంతరం వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇస్తామన్న హామీతో 4 రోజుల క్రితమే కాంగ్రెస్‌లో చేరారు. కాగా.. ఇదే సమయంలో ఇటు కడియం ‌శ్రీహారి.. ఆయన కుమార్తె కావ్య ఇద్దరు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఇప్పుడు అసలు పోటీ నెలకొంది. వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా కావ్యను నెలబెడుతుందా..? లేక ఇచ్చిన హామీ ప్రకారం పసునూరి దయాకర్‌ను ప్రకటిస్తుందా.. అన్నది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తిగా మారింది.

Jyothi

Jyothi

Next Story