Kadem Project: కడెం ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద ఉధృతి

Kadem Project: నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతుంది.

Arun Chilukuri
Published on: 26 Sept 2025 2:17 PM IST
Kadem Project: కడెం ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద ఉధృతి
X

Kadem Project: నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్ట్ 3 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు.

ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా... ప్రస్తుతం 698 అడుగులకి చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 4 వేల 699 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 4 వేల 282 టీఎంసీలకు చేరుకుంది. ఇన్ ఫ్లో 6 వేల 553 క్యూసెక్కులుగా... ఔట్ ఫ్లో 19 వేల 947 క్యూసెక్కులుగా ఉంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో దిగువ ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story