KA Paul: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గొప్ప నాయకుడు

KA Paul: కేసీఆర్ పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగింది

Shekhar G
Published on: 10 Feb 2024 2:46 PM IST
KA Paul Comments On CM Revanth Reddy
X

KA Paul: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గొప్ప నాయకుడు

KA Paul: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గొప్ప నాయకుడని పొగిడారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే అక్టోబర్ నుంచి రాష్ట్ర పరిస్థితి మారుతుందన్నారు. రేవంత్‌తో పాటు ప్రపంచంలోని బిలినీయర్స్ కలిసి రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తామన్నారు కేఏ పాల్. రష్యా ప్రెసిడెంట్‌కు ఇంగ్లిష్ రాదని..అయినా కూడా ప్రపంచంలోనే ముఖ్యమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు.

రేవంత్‌ ఇంగ్లిష్‌పై విమర్శలు చేయడం తెలివ తక్కువ తనానికి నిదర్శమని అన్నారు. కేసీఆర్ పాలనలో 12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని కేఏ పాల్ ఆరోపించారు. త్వరలో ఏపీలో జరగనున్న ఎన్నికల్లో తాను విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story