Kavitha: సీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై కవిత ఫైర్.. రాజకీయంగా ఎదుర్కొలేకనే సీఎం ఓ వర్గాన్ని టార్గెట్ చేశారు

Kavitha: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెలమ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Arun Chilukuri
Published on: 5 Feb 2026 4:08 PM IST
Kavitha: సీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై కవిత ఫైర్.. రాజకీయంగా ఎదుర్కొలేకనే సీఎం ఓ వర్గాన్ని టార్గెట్ చేశారు
X

Kavitha: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెలమ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, సామాజిక వర్గాలను కించపరిచేలా మాట్లాడటం ముఖ్యమంత్రికి తగదని ఆమె మండిపడ్డారు.

రాజకీయాల్లో విమర్శలు సహజమని, కానీ రేవంత్ రెడ్డి అన్ని మర్యాదలు అతిక్రమించి ఒక వర్గంపై విషం చిమ్ముతున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. "రాజకీయంగా ఎదుర్కోలేకనే రేవంత్ రెడ్డి వెలమ జాతిని టార్గెట్ చేస్తున్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడటం సరైన పద్ధతి కాదు" అని ఆమె హితవు పలికారు.

ముఖ్యమంత్రి తన వైఖరిని మార్చుకోవాలని, కులాలను, వర్గాలను రెచ్చగొట్టే ధోరణిని మానుకోవాలని కవిత సూచించారు. రాజకీయ ప్రత్యర్థులను విధానాల పరంగా విమర్శించాలి తప్ప, ఒక సామాజిక వర్గం మొత్తాన్ని కించపరచడం మంచి పద్ధతి కాదని ఆమె స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story