Telangana: టీఎస్ హైకోర్టు సీజేగా సతీశ్‌ చంద్రశర్మ ప్రమాణం

Telangana: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ప్రమాణస్వీకారం చేశారు.

Arun Chilukuri
Published on: 11 Oct 2021 3:11 PM IST
Justice Satish Chandra Sharma Takes Oath as CJ of Telangana High Court
X

Telangana: టీఎస్ హైకోర్టు సీజేగా సతీశ్‌ చంద్రశర్మ ప్రమాణం

Telangana: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సీజేతో ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలంగాణ స్పీకర్, సీఎం కేసీఆర్, మంత్రులు హాజరయ్యారు. 1961 నవంబర్ 30న మధ్యప్రదేశ్‌లో జన్మించిన ఆయన జబల్‌పూర్‌లోని సెంట్రల్‌ స్కూల్‌లో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ఎల్‌ఎల్‌బీలో మూడు బంగారు పతకాలు సాధించారు. 2008లో మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కర్ణాటక హైకోర్టు తాత్కాలిక సీజేగా సతీష్ చంద్ర శర్మ పని చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story