ఊహించని ట్విస్ట్‌.. అమిత్‌షా ఆఫీస్‌ నుంచి జూనియర్‌ ఎన్టీఆర్‌కు పిలుపు

Amit Shah: టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు అమిత్ షా కార్యాలయం నుంచి పిలుపు రావడంపై రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Arun Chilukuri
Published on: 21 Aug 2022 1:23 PM IST
Junior NTR Meeting With Union Minister Amit Shah
X

ఊహించని ట్విస్ట్‌.. అమిత్‌షా ఆఫీస్‌ నుంచి జూనియర్‌ ఎన్టీఆర్‌కు పిలుపు

Amit Shah: టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు అమిత్ షా కార్యాలయం నుంచి పిలుపు రావడంపై రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ నటించిన ట్రిపుల్ ఆర్ సినిమాను అమిత్ షా చూశారు. ఎన్టీఆర్ నటన నచ్చి ఆయనతో కొద్దిసేపు అమిత్ షా చర్చిస్తారని తెలుస్తోంది. అయితే పొలిటికల్ ఎజెండాలో భాగంగానే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్‌ను ఆహ్వానించినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ హాట్‌గా చర్చ నడుస్తోంది. అయితే ఇద్దరూ ఎలాంటి అంశాలపై చర్చిస్తారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో టీడీపీ తరపున ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story