Telangana: రేపటి నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి జూనియర్‌ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు సమ్మెకు దిగుతున్నట్లు పేర్కొన్నారు.

Venkata Chari
Published on: 25 May 2021 8:50 PM IST
Junior Doctors Strike From May 26th
X

జూనియర్ డాక్టర్లు (ఫొటో ట్విట్టర్)

Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి జూనియర్‌ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు సమ్మెకు దిగుతున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర సేవల మినహా, విధులను బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు. పెంచిన స్టైపండ్‌, ప్రోత్సాహకాలు వెంటనే విడుదల చేయాలని జూడాలు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రభుత్వం మా సమ్మె పై స్పందించకుంటే 27 నుంచి అన్ని విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలపై వెంటనే స్పందించాలి. లేదంటే ఈ నెల 27 నుంచి పూర్తిగా విధులు బహిష్కరిస్తామని రెసిడెంట్‌ డాక్టర్లు వెల్లడించారు. ఈ మేరకు ఈ నెల 10న జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందించారు.

Venkata Chari

Venkata Chari

Next Story