Coronavirus: తెలంగాణ ప్రభుత్వానికి జూనియర్‌ డాక్టర్లు షాక్

Junior Doctors gave Shock To Telangana Government
x

Coronavirus: తెలంగాణ ప్రభుత్వానికి జూనియర్‌ డాక్టర్లు షాక్ (ఫైల్ ఇమేజ్ )

Highlights

Coronavirus: కోవిడ్‌ ఉద్ధృతి సమయంలో జూనియర్‌ డాక్టర్లు తెలంగాణ ప్రభుత్వానికి షాకిచ్చారు.

Coronavirus: కోవిడ్‌ ఉద్ధృతి సమయంలో జూనియర్‌ డాక్టర్లు తెలంగాణ ప్రభుత్వానికి షాకిచ్చారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఇవాళ్టి నుంచి సమ్మె బాట పట్టారు. అత్యవసర సేవలు మినహా మిగతా విధులు బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ ప్రకటించింది. డిమాండ్ల సాధనలో భాగంగా ఈ నెల 10న రాష్ర్ట వైద్య విద్య సంచాలకులు రమేష్ రెడ్డికి సమ్మె నోటీసు ఇచ్చారు తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు. 15 రోజుల్లో తమ డిమాండ్లు పరిష్కరించాలని నోటీసులో స్పష్టం చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో సమ్మెకు దిగుతున్నట్లు జూడాల సంఘం స్పష్టం చేసింది. సీఎం కేసీఆర్ గాంధీ ఆసుపత్రి సందర్శించిన సందర్బంలోనూ జూడాల సమస్యలు పరిష్కరానికి కృశి చేస్తామని చెప్పారని జూడా ప్రతినిధులు చెబుతున్నారు. తప్పని పరిస్థితుల్లో సమ్మెకు దిగుతున్నట్లు వెల్లడించారు.

జూనియర్ డాక్టర్ల సమ్మెతో మెడికల్ కాలేజిల్లో వైద్యసేవలకు ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత నేపధ్యంలో కొవిడ్ యేతర సేవలకు సంబంధించిన వార్డుల్లోనూ రద్దీ కొనసాగుతోంది. రోజు వారి అవుట్ పేషంట్ల విభాగాలు సైతం కిటకిటలాడుతున్నాయి. జూనియర్ డాక్టర్లు సమ్మెతో గందరగోళం ఏర్పడింది. రెండురోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 28 నుంచి అన్ని రకాల విధులు బహిష్కరించనున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. రాష్ర్టంలో దాదాపు ఆరు వేల మంది జూనియర్ డాక్టర్లు, మరో వెయ్యి మంది వరకు సీనియర్ రెసిడెంట్లు ఉన్నారు. ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో జూడాల సేవలే కీలకంగా ఉన్నాయి.

మరో వైపు జూనియర్ డాక్టర్ల సమ్మెతో పాటు తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కూడా సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చారు. కొవిడ్ అత్యవసర, ఐసీయూ సేవలకు మాత్రమే హాజరు కానున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకుంటే ఈనెల 27 నుంచి అన్ని రకాల విధులు బహిష్కరించనున్నట్లు తెలిపారు.

జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సంబంధిత ప్రిన్సిపాల్స్, డైరెక్టర్స్, సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేసింది వైద్య ఆరోగ్యశాఖ అధికారులు. కొవిడ్, ఇతర వైద్య సేవలు అందించడంలో ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కొత్తగా డ్యూటీ రోస్టర్ రూపొందించాలను స్పష్టం చేసింది. డైరెక్టరేట్ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సెలవులు రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories