రేప్‌ కేసులో బయటకొస్తున్న సంచలన విషయాలు.. గోళ్లతో రక్కుతూ.. బాలికకు నరకం చూపిన నిందితులు..

Teen Gang Raped: జూబ్లీహిల్స్‌ రేప్‌ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి

Arun Chilukuri
Published on: 10 Jun 2022 4:03 PM IST
Jubilee Hills Gang Rape Case Latest Updates
X

రేప్‌ కేసులో బయటకొస్తున్న సంచలన విషయాలు.. గోళ్లతో రక్కుతూ.. బాలికకు నరకం చూపిన నిందితులు..

Teen Gang Raped: జూబ్లీహిల్స్‌ రేప్‌ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. బాలికపై యువకులు విచక్షణారహితంగా దాడి చేసినట్లు తెలుస్తుంది. అమ్మాయి నిరాకరించడంతో గోళ్ళతో దాడి చేసినట్లు సమాచారం. బాలిక మెడపై బాధిత తల్లిదండ్రులు 12 గాయాలు గుర్తించినట్లు తెలుస్తుంది. రేప్‌ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. కేసులో ఏ-1గా ఉన్న సాదుద్దీన్ ను చంచల్గూడ జైలు నుంచి పోలీస్‌ కస్టడీలోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారించాల్సి ఉన్నందున కస్టడీకి ఇవ్వాలని పోలీసులు గతంలో కోరిన సంగతి తెలిసిందే. దీంతో నేటి నుంచి ఈనెల 12వ తేదీ వరకు కస్టడీకి కోర్టు అనుమతించింది. సాదుద్దీన్ మాలిక్ ను ప్రశ్నిస్తే మరికొన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు పోలీసులు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story