బోరబండలో కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌.. పోలింగ్‌ బూత్‌లో బీఆర్‌ఎస్‌ కార్యకర్తపై కాంగ్రెస్‌ నేత బాబా ఫసియుద్దీన్‌ దాడి

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక పోలింగ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 11 Nov 2025 11:46 AM IST
బోరబండలో కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌.. పోలింగ్‌ బూత్‌లో బీఆర్‌ఎస్‌ కార్యకర్తపై కాంగ్రెస్‌ నేత బాబా ఫసియుద్దీన్‌ దాడి
X

బోరబండలో కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌.. పోలింగ్‌ బూత్‌లో బీఆర్‌ఎస్‌ కార్యకర్తపై కాంగ్రెస్‌ నేత బాబా ఫసియుద్దీన్‌ దాడి

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక పోలింగ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బోరబండలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలింగ్‌ బూత్‌లో బీఆర్‌ఎస్‌ కార్యకర్తపై కాంగ్రెస్‌ నేత బాబా ఫసియుద్దీన్‌ దాడి చేశారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. అయితే బీఆర్‌ఎస్‌ కార్యకర్తపై దాడిని తీవ్రంగా ఖండించారు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌.

బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు. అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా మారారంటూ ఫైర్‌ అయ్యారు. పోలింగ్‌ సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనని అన్నారు. ఓటర్లు భయపడకుండా స్వచ్ఛందంగా పోలింగ్‌ బూత్‌లకు తరలివచ్చి ఓటేయాలని పిలుపునిచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story