JP Nadda: ఇవాళ తెలంగాణలో జేపీ నడ్డా పర్యటన

JP Nadda: కొల్లాపూర్‌, ఎల్లారెడ్డిలో ప్రచార సభలు

Shekhar G
Published on: 19 Nov 2023 11:06 AM IST
JP Nadda Visit To Telangana Today
X

JP Nadda: ఇవాళ తెలంగాణలో జేపీ నడ్డా పర్యటన 

JP Nadda: రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచింది. అగ్రనేతలు వరుస పర్యటనలు, ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. నారాయణపేట, చేవెళ్లలో నిర్వహించే సకల జనుల విజయ సంకల్ప సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో ఆయన రోడ్ షో నిర్వహిస్తారు. సోమవారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బీజేపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కొల్లాపూర్, ఎల్లారెడ్డిలో నిర్వహించే ప్రచార సభల్లో ఆయన పాల్గొంటారు.

Shekhar G

Shekhar G

Next Story