JP Nadda: కేసీఆర్‌కు గుడ్‌బై చెప్పాల్సిన టైమ్ వచ్చింది..

JP Nadda: సీఎం కేసీఆర్‌ పాలనంతా అవినీతి, అక్రమాలేనని బీజేపీ నేత జేపీ నడ్డా విమర్శించారు.

Arun Chilukuri
Updated on: 15 Dec 2022 7:45 PM IST
JP Nadda Slams CM KCR in Karimnagar
X

JP Nadda: కేసీఆర్‌కు గుడ్‌బై చెప్పాల్సిన టైమ్ వచ్చింది..

JP Nadda: సీఎం కేసీఆర్‌ పాలనంతా అవినీతి, అక్రమాలేనని బీజేపీ నేత జేపీ నడ్డా విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గుడ్‌ బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని నడ్డా అన్నారు. కరీంనగర్‌ ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్‌లో 5వ విడత ప్రజాసంగ్రామయాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా వచ్చిన నడ్డా.. వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్నకు ప్రణామాలు తెలుపుతూ తన స్పీచ్‌ను ప్రారంభించారు. ఉద్యమాల గడ్డ కరీంనగర్‌ అని కొనియాడిన ఆయన.. అన్నివర్గాల సంక్షేమం కోసమే బీజేపీ పాటుపడుతోందని అన్నారు. ప్రజాసంగ్రామ యాత్ర ఆరంభం మాత్రమే.. ఆగేది కాదని నడ్డా చెప్పుకొచ్చారు. ప్రజా గోస-బీజేపీ భరోసా కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story