JP Nadda: త్వరలోనే కేసీఆర్‌ను ప్రజలు ఇంట్లో కూర్చోబెడతారు..
JP Nadda: కేసీఆర్ పాలనను సాగనంపడమే.. ప్రజా సంగ్రామ యాత్ర సంకల్పం అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.
JP Nadda: త్వరలోనే కేసీఆర్‌ను ప్రజలు ఇంట్లో కూర్చోబెడతారు..
JP Nadda: కేసీఆర్ పాలనను సాగనంపడమే.. ప్రజా సంగ్రామ యాత్ర సంకల్పం అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో తరలివచ్చిన అశేష జనవాహిని ఉద్దేశించి ప్రసంగించిన జేపీ నడ్డా కేసీఆర్ మరో నిజాంలో వ్యవహరిస్తున్నారని అన్నారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ దారిలోనే కేసీఆర్ వెళ్తున్నారని ఆయన్ని కూడా త్వరలోనే ఇంట్లో కూర్చోబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మజ్లీస్‌కు భయపడి తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదన్న నడ్డా కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్‌కు ఏటీఎంలా మారిందన్నారు. కేంద్రం నిధులన్నీ కేసీఆర్ పేరు పెట్టుకుని వాడుకుంటున్నారని నడ్డా ఆరోపించారు.
Next Story




