JP Nadda: ఏం జరిగింది జీ.. సంజయ్‌ అరెస్ట్‌పై జేపీ నడ్డా ఆరా!

JP Nadda: మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు జేపీ నడ్డా ఫోన్

Dhatripriya
Published on: 5 April 2023 11:38 AM IST
JP Nadda Asking About Bandi Sanjay Arrest
X

JP Nadda: ఏం జరిగింది జీ.. సంజయ్‌ అరెస్ట్‌పై జేపీ నడ్డా ఆరా!

JP Nadda: TBJP చీఫ్ బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ అధినాయకత్వం ఆరా తీస్తోంది. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేశారు. బండి అరెస్టుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అరెస్టు ఎప్పుడు జరిగింది. ప్రస్తుత పరిస్థితి ఏంటన్న వివరాలు నడ్డా తెలుసుకున్నారు.

నడ్డాతో ఫోన్ కాల్ అనంతరం మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు స్పందించారు. బండి అరెస్టును ఖండించారు. సంజయ్ అరెస్టును అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. అర్థరాత్రి ఎందుకు అరెస్టు చేశారంటూ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story