Jogu Ramanna: బీజేపీ, కాంగ్రెస్ బడే భాయ్ చోటే భాయ్ అని..మరోసారి నిరూపితమైంది

Jogu Ramanna: మోడీ ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం బాధాకరం

Dhatripriya
Published on: 5 March 2024 5:49 PM IST
Jogu Ramanna Has Commented On The BJP And Congress
X

Jogu Ramanna: బీజేపీ, కాంగ్రెస్ బడే భాయ్ చోటే భాయ్ అని..మరోసారి నిరూపితమైంది

Jogu Ramanna: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నరేంద్ర మోడీ నిర్వహించిన సభ ముమ్మాటికీ ఎన్నికల ప్రచారమేనని ఆదిలాబాద్ జిల్లా మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభకు హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ జిల్లా ప్రజలకు మరోసారి అన్యాయం చేశారని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ బడే భాయ్ ,చోటే భాయ్ అని మరోసారి నిరూపితమైందన్నారు మోడీ వస్తున్నారని ఆదిలాబాద్ ప్రజలు కోటి ఆశలతో ప్రజలు ఎదురుచూశారని..ఆదిలాబాద్ అభివృద్ధికి, పెండింగ్ డిమాండ్లపై మోడీ ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. ఆదిలాబాద్ ప్రజలు ఎంతో విజ్ఞులని, రానున్నఎంపీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెప్తారన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story