Jogu Ramanna: 6గ్యారంటీలు అమలు చేయాలి.. కాంగ్రెస్‌పై జోగురామన్న విమర్శలు

Jogu Ramanna: ఆరు గ్యారంటీలు అమలు చేయాలన్న జోగురామన్న

Shekhar G
Updated on: 1 Feb 2024 8:15 PM IST
Jogu Ramanna Comments On Congress Government
X

Jogu Ramanna: 6గ్యారంటీలు అమలు చేయాలి.. కాంగ్రెస్‌పై జోగురామన్న విమర్శలు

Jogu Ramanna: ఆరు గ్యారంటీ పథకాల పేరిట ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆ ఫథకాలను అమలు చేయాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు, ముఖ్యమంత్రి హోదాలో ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్న రేవంత్ రెడ్డి ఈ పథకాలపై స్పష్టత ఇవ్వాలన్నారు.

ఎన్నికల సమయంలో ఆదిలాబాద్ లో పెండింగ్ సమస్యలపై రకరకాల హామీలు ఇచ్చారని వీటన్నిటిపై స్పష్టమైన ప్రకటన చేయాలని జోగు రామన్న డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీ పథకాల పేరిట ప్రజలను చీటింగ్ చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ గడిచిన రెండు నెలలుగా ప్రజలుకు, రైతులకు చేసిందేమీలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ ఓట్లు దండుకోవడానికి కుట్రలు సాగిస్తున్నారంటున్న మాజీ మంత్రి జోగు రామన్న.

Shekhar G

Shekhar G

Next Story