Mallu Bhatti Vikramarka: జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన భట్టి విక్రమార్క

Mallu Bhatti Vikramarka: ఏడాదిలో ప్రభుత్వం చేపట్టబోయే ఉద్యోగ నోటిఫికేషన్, ఎగ్జామ్‌ తేదీలతో క్యాలెండర్‌

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 2 Aug 2024 7:03 PM IST
Job calendar released by Bhatti Vikramarka
X

Mallu Bhatti Vikramarka: జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన భట్టి విక్రమార్క

Mallu Bhatti Vikramarka: అసెంబ్లీలో జాబ్‌ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఏడాదిలో ప్రభుత్వం చేపట్టబోయే ఉద్యోగ నోటిఫికేషన్, ఎగ్జామ్‌ తేదీలతో కూడిన జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించారు. ఐతే అందులో ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తారనే సమాచారం లేకపోవడంతో బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. తొలి ఏడాదిలో 2లక్షల ఉద్యోగాల సంగతి ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్‌పై సభలో చర్చించాలని బీఆర్ఎస్‌ పట్టుబట్టగా.. కేవలం ఇది మంత్రివర్గం తీసుకున్న స్టేట్‌మెంట్ మాత్రమే అని చర్చ ఉండదని భట్టి వివరణ ఇచ్చారు.

1.సింగరేణిలో పలు ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జులైలో నోటిఫికేషన్.. నవంబర్‌లో పరీక్షలు

2. వచ్చే ఏడాది జులైలో గ్రూప్‌-3 నోటిఫికేషన్ నవంబర్‌లో పరీక్షలు

3. వచ్చే ఏడాది మేలో మరోసారి గ్రూపు2 నోటిఫికేషన్.. అక్టోబర్‌లో పరీక్షలు

4. డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు వచ్చే ఏడాది జూన్‌లో నోటిఫికేషన్..సెప్టెంబర్‌లో పరీక్షలు

5. ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తారు

6. గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్ష వచ్చే ఏడాది జులైలో నిర్వహించనున్నారు

7. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ .. మేలో పరీక్షలు

8.వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల .. ఏప్రిల్‌లో పరీక్షలు

9.వివిధ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల.. ఏప్రిల్‌లో పరీక్షలు

10.నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు

11.ట్రాన్స్‌కోలోని వివిధ ఇంజినీరింగ్ ఉద్యోగాల కోసం అక్టోబర్‌లో నోటిఫికేషన్.. వచ్చే ఏడాది జనవరిలో నియామక పరీక్షలు

12.వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ నియామకాల కోసం సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల... నవంబర్‌లో పరీక్షలు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story