TG News: జిష్ణు దేవ్ వర్మ తెలంగాణ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 31 July 2024 6:12 PM IST
Jishnu Dev Varma was sworn as the Governor of Telangana
X

TG News: జిష్ణు దేవ్ వర్మ తెలంగాణ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం

TG News: జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ గవర్నర్ గా బుధవారం ప్రమాణం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే బుధవారం ఆయనతో ప్రమాణం చేయించారు. త్రిపుర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా 2018 నుంచి 2023 వరకు ఆయన పనిచేశారు. 1990లో ఆయన బీజేపీలో చేరారు. త్రిపురలో రాజకుటుంబానికి చెందిన జిష్ణుదేవ్ వర్మను ఇటీవలనే రాష్ట్రపతి తెలంగాణ గవర్నర్ గా నియమించారు. రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story