ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి గెలుపు

Raj
By Raj
Published on: 27 March 2019 6:44 AM IST
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి గెలుపు
X

కరీంనగర్‌-ఆదిలాబాద్‌- నిజామాబాద్‌-మెదక్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్ నేత తాటిపర్తి జీవన్‌రెడ్డి విజయం సాధించారు. ఆయన సమీప టీఆరెస్ అభ్యర్థి చంద్రశేఖర్‌పై 39,430 ఓట్ల మెజారిటీతో భారీ విజయంసాధించారు. మొత్తం 17 మంది ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలువగా.. మొత్తం 1,15,458 ఓట్లు పోలయ్యాయి. జీవన్‌రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధించినట్టు తెలుస్తోంది. 14 టేబుళ్లపై 9 రౌండ్లలో అధికారులు ఓట్ల లెక్కింపును చేపట్టారు. కాగా కాంగ్రెస్ పార్టీ విజయంతో ఆ పార్టీ నేతల్లో సంతోషం నెలకొంది. మరోవైపు జర్నలిస్ట్ రాణి రుద్రమదేవి గౌరవప్రధ ఓట్లను సాధించారు.

Raj

Raj

Next Story