Hyderabad: ప్రియుడితో కలిసి తల్లిని చంపిన పదో తరగతి బాలిక

Jeedimetla Mother Murder Case Telugu
x

Hyderabad: ప్రియుడితో కలిసి తల్లిని చంపిన పదో తరగతి బాలిక

Highlights

Hyderabad: హైదరాబాద్‌ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

Hyderabad: హైదరాబాద్‌ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఓ పదో తరగతి విద్యార్థిని తన ప్రేమికుడితో కలిసి కన్న తల్లిని హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజుల క్రితం పదో తరగతి చదువుతోన్న బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అనంతరం అది ప్రేమగా మారింది. తమ ప్రేమ వ్యవహారాన్ని తల్లి అడ్డుకోవడంతో బాలిక ప్రేమికుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. కుమార్తె కనిపించకపోవడంతో తల్లి జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

గత రాత్రి బాలిక ప్రియుడితో కలిసి ఇంటికి వచ్చింది. నిద్రిస్తున్న తల్లి అంజమ్మ గొంతు నులిమి, కర్రతో తలపై బలంగా కొట్టి హతమార్చినట్టు సమాచారం. ఈ దారుణానికి బాలిక, ఆమె ప్రియుడు, అతడి తమ్ముడు కలిసి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలికను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories