JC Prabhakar Reddy: నాపై 68 కేసులు పెట్టారు.. జనం తిరగబడితే తట్టుకోలేరు

JC Prabhakar Reddy: డీఎస్పీ చైతన్యపై జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం

Jyothi
Published on: 25 Jan 2023 5:29 PM IST
JC Prabhakar Reddy Fire on DSP Chaitanya
X

JC Prabhakar Reddy: నాపై 68 కేసులు పెట్టారు.. జనం తిరగబడితే తట్టుకోలేరు

JC Prabhakar Reddy: తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య ఎమ్మెల్యే, ఆయన తనయుడు చెప్పినట్లు చేస్తున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి. తన భూములపై ఎమ్మెల్యే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని.. పరిశీలించిన అధికారులు 1907 నుంచి రికార్డులు పరిశీలించి అస్మిత్‌రెడ్డి పేరుతో ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే అండతో డీఎస్పీ చైతన్య నా స్థలాలు కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపించారు. డీఎస్పీ అక్రమాలపై ఎస్పీ, డీఐజీ జోక్యం చేసుకోవాలన్నారు. తన మేనేజర్‌పై అక్రమంగా కేసులు పెట్టాలని నోటీసులిచ్చారని తెలిపారు. తన భూములను లాక్కోవాలని చూస్తున్న డీఎస్పీపై చర్యలు తీసుకోవాలని లేదంటే లా అండ్‌ ఆర్డర్‌ బ్రేకవుతుందని హెచ్చరించారు. తనపై 68 కేసులు పెట్టారని తెలిపిన జేసీ ప్రభాకర్‌రెడ్డి జనం తిరగబడితే తట్టుకోలేరన్నారు. డీఎస్పీపై విచారణ జరపించాలని.. దాని కోసం ఎంతదూరమైనా వెళ్తానన్నారు. డీఎస్పీపై కోర్టులో కేసు దాఖలు చేశామని జేసీ తెలిపారు.

Jyothi

Jyothi

Next Story