MLC Kavitha: తెలంగాణను ఆంధ్రాలో కలపకుండా ప్రొ.జయశంకర్ పోరాడారు

MLC Kavitha: ప్రొ.జయశంకర్ ప్రతీ ఒక్కరిలో ఉద్యమ స్ఫూర్తిని నింపారు

Shekhar G
Published on: 6 Aug 2023 2:52 PM IST
Jayashankar Fought Not To Merge Telangana Into Andhra Pradesh Says Kavitha
X

MLC Kavitha: తెలంగాణను ఆంధ్రాలో కలపకుండా ప్రొ.జయశంకర్ పోరాడారు

MLC Kavitha: మేడ్చల్‌లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్సీ కవిత. ప్రొఫెసర్ జయశంకర్‌ జయంతి రోజున విగ్రహ ప్రతిష్ట చేయడం సంతోషంగా ఉందన్నారు. 1948 నుంచి తెలంగాణను ఆంధ్రాలో కలపకుండా ప్రొఫెసర్ జయశంకర్ పోరాడి.. అందరిలో ఉద్యమ స్ఫూర్తి నింపారని గుర్తుచేశారు. నేడు రాష్ట్రంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అందుకుంటున్న మహిళల ముఖాల్లోని చిరునవ్వుల్లో ప్రొఫెసర్ జయశంకర్ ఆత్మ సంతృప్తి చూసుకోవచ్చన్నారు కవిత. విగ్రహావిష్కరణకు ముందు ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గజమాలతో కవితను సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో కోలాటం వేసి అలరించారు కవిత.

Shekhar G

Shekhar G

Next Story