Janwada Farm House: మళ్లీ తెరపైకి జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసు

Janwada Farm House: జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో తాజాగా ఛార్జిషీట్ దాఖలైంది.

Arun Chilukuri
Published on: 24 Dec 2025 11:48 AM IST
Janwada Farm House: మళ్లీ తెరపైకి జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసు
X

Janwada Farm House: మళ్లీ తెరపైకి జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసు

Janwada Farm House: జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో తాజాగా ఛార్జిషీట్ దాఖలైంది. గతేడాది అక్టోబర్ 26న కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్‌హౌజ్‌లో పార్టీ నిర్వహించారు. పార్టీకి అనుమతి లేకపోవడంతో పాటు అక్రమంగా మద్యం వినియోగించారని పోలీసులు రైడ్ చేశారు. ఆ పార్టీలో పాల్గొన్నవారికి అప్పట్లో డ్రగ్ పరీక్షలు నిర్వహించారు పోలీసులు. అందులో విజయ్ మద్దూరికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. దీంతో అతడిపై NDPS యాక్ట్ కింద నమోదు చేశారు మోకిల పోలీసులు. తాజాగా ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేశారు మోకిల పోలీసులు. ఈ కేసులో మొత్తం 35 మంది స్టేట్మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story