ఫోర్జరీ చేశాడు.. తండ్రి పై కూతురు ఫిర్యాదు.. జనగామ ఎమ్మెల్యే పై కేసు నమోదు

Muthireddy Yadagiri Reddy: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపైపై కేసు నమోదు అయింది.

Arun Chilukuri
Published on: 9 May 2023 12:15 PM IST
Jangaon MLA Muthireddy Yadagiri Reddy Daughter Complains on his Father About Land Dispute
X

ఫోర్జరీ చేశాడు.. తండ్రి పై కూతురు ఫిర్యాదు.. జనగామ ఎమ్మెల్యే పై కేసు నమోదు

Muthireddy Yadagiri Reddy: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపైపై కేసు నమోదు అయింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫోర్జరీ చేశారంటూ ఆయన కుమార్తె తుల్జా భవానీ రెడ్డి ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి సిద్ధిపేట జిల్లా చేర్యాలలో ఎకరం 20 గుంటల భూమిని కబ్జా చేశారని ముత్తిరెడ్డిపై భవాని కంప్లైంట్ చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు ముత్తిరెడ్డి యాదగిరిపై 406, 420, 463, 464, 468, 471, R/W 34 IPC 156(3)CRPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై గతంలోనూ భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. చెరువు భూమిని కబ్జా చేశారని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఆయన కూతురు తుల్జా భవానీ స్వయంగా ఫిర్యాదు చేయడంతో భూవివాదం మరోసారి తెరపైకి వచ్చింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story