JanaSena: తెలంగాణలో పోటీ చేసేందుకు జనసేన కసరత్తు

JanaSena Ready to Contest in Telangana
x

JanaSena: తెలంగాణలో పోటీ చేసేందుకు జనసేన కసరత్తు

Highlights

JanaSena: పోటీకి సిద్ధంగా ఉండాలని కేడర్‎కు పవన్ పిలుపు

JanaSena: తెలంగాణ ఎన్నికల్లో పోటీకి జనసేన పార్టీ కసరత్తు ప్రారంభించింది. తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కార్యవర్గం ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 32 నియోజకవర్గాల్లో నూతన కార్యనిర్వాహకులను నియామించింది. నూతన కమిటీల ఏర్పాటులో కొత్త వారికి అవకాశం కల్పించినట్లు జనసేన తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ శంకర్ గౌడ్ ప్రకటన విడుదల చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం పనిచేసిన వారికి ఎక్కవగా అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మొదటి విడతగా 32 మందికి కార్యనిర్వహకులుగా అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories