Rajanna Sircilla: సిరిసిల్ల చేనేత మగ్గంపై జనసేనా దుస్తులు

Rajanna Sircilla: పవన్ కళ్యాణ్ ధరించే దుస్తులు తయారు చేసే.. అవకాశం అభించింది

Shashank Gullapelli
Published on: 2 Aug 2024 8:52 PM IST
Janasena dress on Sircilla handloom
X

Rajanna Sircilla: సిరిసిల్ల చేనేత మగ్గంపై జనసేనా దుస్తులు

Rajanna Sircilla: సిరిసిల్లా చేనేత మగ్గంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దుస్తులు తయారయ్యాయి. సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్‌కు జనసేన పార్టీ అధినేత, పవన్ కళ్యాణ్ ధరించే దుస్తులు తయారు చేసే అరుదైన అవకాశం అభించింది. గతంలో హరిప్రసాద్ చేనేత మగ్గంపై పవన్ కళ్యాణ్ చిత్రాన్ని జ్ఞాపికను తయారు చేసిన కలను చూసిన అమెరికాలోని అట్లాంటాకు చెందిన పవన్ అభిమాని, సూమారుగా 6 లక్షల రూపాయల విలువగల వస్రాలను, చేనేత మగ్గంపై తయారు చేయాలని హరి ప్రసాద్‌కి ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ తీసుకున్నా హరిప్రసాద్ దంపతులు దాదాపు 25 రోజులు శ్రమించి పవన్ కళ్యాణ్ దుస్తులను తయారు చేశారు. పవన్ ధరించే చొక్కాపై జనసేన లోగో వచ్చేలా తయారు చేయడానికి ఆయనకు ఐదు రోజుల సమయం పట్టింది అని అన్నాడు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story