Pawan Kalyan: జనసేనపై కుట్ర.. టీ.బీజేపీపై పవన్ సంచలన వ్యాఖ్యలు ‌‌‌

Pawan Kalyan: జనసేనపై కుట్ర చేస్తోంద అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.‌

Samba Siva Rao
Published on: 14 March 2021 12:07 PM IST
Pawan Kalyan Comments On BJp
X

పవన్ కళ్యాణ్ ఇమేజ్ సోర్స్ ( TheHansIndia)

Pawan Kalyan: తెలంగాణ బీజేపీపై జనసేనాని పవన్‌కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికల్లో జనసైనికులు ఎంతో కృషి చేశారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చెప్పినా... తెలంగాణ బీజేపీ నేతలు కనీసం స్పందించలేదని విమర్శించారు. కేంద్రంలోని ముఖ్యలు, కమలం పెద్దలు జనసేనతో ఉన్నా.. తెలంగాణ బీజేపీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దివంగత నేత, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు వాణి దేవికే తమ మద్ధతు అని ప్రకటించారు. బీజేపీ జనసేనను చులకన చేసి మాట్లాడిందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానం నుంచి పీవీ కూతురు వాణి దేవి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story