Shankar Goud: పోసానిని తెలంగాణ నుంచి బహిష్కరించండి..

Janasena Activists Protest Against Posani Krishna Murali
x

Shankar Goud: పోసానిని తెలంగాణ నుంచి బహిష్కరించండి..

Highlights

Shankar Goud: ఏపీ రాజకీయాలు జనసేన వర్సెస్ వైసీపీగా మారాయి.

Shankar Goud: ఏపీ రాజకీయాలు జనసేన వర్సెస్ వైసీపీగా మారాయి. మొన్నటి వరకు టీడీపీ వర్సెస్ వైసీపీగా ఉన్న రాజకీయం మరో టర్న్ తీసుకుంది. ఇటీవల రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏపీ ప్రభుత్వ తీరుపై పవన్ తీవ్ర విమర్శలు చేశారు. అప్పటి నుంచి హీట్ కంటిన్యూ అవుతోంది.

రెండు రోజుల క్రితం మొదలైన రాజకీయా దుమారం ఇప్పటికీ ఆగడం లేదు. ఇంకాస్త పీక్‌కు చేరుతోంది. ఏపీ మంత్రులు కూడా పవన్‌న్ టార్గెట్‌ చేస్తూ విరుచుకుపడుతున్నారు.

ఇక పవన్ వ్యాఖ్యలను తప్పు పడుతూ పలువురు మంత్రులు మండిపడుతున్నారు. వారికి తోడు పోసాని సైతం ఓ రేంజ్‌లో విమర్శలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పవన్ కూడా వారికి ట్వీట్స్ ద్వారా కౌంటర్లు వేస్తున్నారు. అయితే తాజాగా పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలో పోసానిపై జనసైనికులు, కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పవన్‌తో పాటు ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ ఇన్‌ఛార్జ్ శంకర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

జనసేన లీగల్ టీం ఫిర్యాదు కాపీని తయారు చేసి ఎస్‌ఐకు అందించారు. అంతేకాకుండా పోసానిని తెలంగాణ ప్రభుత్వం బహిష్కరించాలని, ఆయన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని ఫైర్ అయ్యారు. పోసాని ప్రవర్తన మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories