గ్రేటర్ బరి నుంచి తప్పుకున్న జనసేన

గ్రేటర్ బరి నుంచి తప్పుకున్న జనసేన
x
Highlights

గ్రేటర్ హైదరాబాద్ బరి నుంచి జనసేన తప్పుకుంది. GHMC ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు. గ్రేటర్...

గ్రేటర్ హైదరాబాద్ బరి నుంచి జనసేన తప్పుకుంది. GHMC ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలవాల్సిన అవసరముందన్న పవన్ ఒక్క ఓటు కూడా వృథా కాకుండా జనసైనికులంతా బీజేపీకి ఓటేయాలని పవన్ పిలుపునిచ్చారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌లు పవన్ కల్యాణ్‌తో చర్చలు జరిపిన తర్వాత జనసేనాని ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి పవన్ కల్యాణ్‌తో చర్చలు జరిపిన బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికల్లో జనసేన మద్దతు కోరినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో జనసేనకు బలమైన క్యాడర్ ఉందన్న లక్ష్మణ్ పవన్‌ను ప్రచారానికి రావాలని కోరామన్నారు. బీజేపీతోనే మార్పు సాధ్యమని, దుబ్బాక ప్రజల మనసు గెలుచుకున్నట్లే హైదరాబాదీల మనసులను కూడా గెలుచుకుంటామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories