Jagtial: మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రావణి రాజీనామా.. ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతున్నారని కంటతడి

Jagtial: జగిత్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రావణి రాజీనామా చేశారు.

Arun Chilukuri
Published on: 25 Jan 2023 4:26 PM IST
Jagtial Municipal Chairperson Sravani Resigned
X

Jagtial: మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రావణి రాజీనామా.. ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతున్నారని కంటతడి

Jagtial: జగిత్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రావణి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కలెక్టర్‌కు పంపించారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇబ్బంది పెడుతున్నారని శ్రావణి కంటతడిపెట్టారు. బీసీ బిడ్డ ఎదుగుతుందని ఓర్వలేక తనపై కక్ష కట్టారని.. పేరుకే తాను ఛైర్‌పర్సన్, పెత్తనమంతా ఎమ్మెల్యేదేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నుంచి తమకు ఆపద ఉందన్న శ్రావణి తన కుటుంబానికి ఏమైనా జరిగితే అందుకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కారణమని చెప్పారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని కోరారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story