జగిత్యాల హస్తం పార్టీలో 'హ్యాండ్' ఇచ్చిన సొంత క్యాడర్: వలస నేతలకు ఓటేయొద్దంటూ కరపత్రాల కలకలం!

Jagtial: జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో విభేదాలు కరపత్రాల యుద్ధానికి దారితీశాయి.

Arun Chilukuri
Published on: 9 Feb 2026 12:24 PM IST
జగిత్యాల హస్తం పార్టీలో హ్యాండ్ ఇచ్చిన సొంత క్యాడర్: వలస నేతలకు ఓటేయొద్దంటూ కరపత్రాల కలకలం!
X

Jagtial: జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో విభేదాలు కరపత్రాల యుద్ధానికి దారితీశాయి. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారిని కాదని.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస నాయకులకు బీ ఫామ్స్ ఇచ్చారంటూ క్యాడర్ భగ్గుమంటుంది. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆశీస్సులతో పలువురు నేతలు స్వతంత్రులుగా బరిలో నిలిచారు. తాజాగా సామాన్య ఓటరు పేరుతో వెలసిన కరపత్రాలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి.

కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న 35 మంది అభ్యర్దులు గతంలో ఏ పార్టీలో ఉన్నారో గుర్తించాలన్నారు. అధికార దాహం కోసం రంగులు మార్చే వారిని రాజకీయ ఊసరవెల్లులుగా అభివర్ణించారు. ఇలాంటి వారికి ఓటు వేయడం సిగ్గు చేటని... రాజ్యాంగాన్ని కాపాడే విధంగా ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటూ కరపత్రంలో పేర్కొన్నారు. జగిత్యాల పట్టణంలో అన్ని ప్రధాన కూడళ్లలో ఈ కరపత్రాలు పంపిణీ కొనసాగుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story