Jagityal SI: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టబడ్డ జగిత్యాల ఎస్ఐ

Jagityal SI: తాజాగా జగిత్యాల ప‌ట్టణ ఎస్సై లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా పట్టుబడ్డాడు.

Kranthi
Published on: 18 Jun 2021 6:28 AM IST
Jagityal SI Found Red Handedly to ACB
X

Jagityala SI Sivakrishna

Jagityal SI: ప్రతి నెలా టంచన్ గా జీతాలందుకుంటూ సర్కారు నౌకరీగిరి వెలగబెడుతోన్న కొందరు అక్రమ ప్రభుత్వ ఉద్యోగులు తరచూ లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడుతున్నా కొందరు ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. తాజాగా జగిత్యాల ప‌ట్టణ ఎస్సై లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా పట్టుబడ్డాడు.

ఎస్సై శివ‌కృష్ణ ఓ బాధితుడికి స్టేష‌న్ బెయిల్ ఇచ్చేందుకు బాధిత వ్యక్తి నుంచి ఏకంగా రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు అవినీతి నిరోధకశాఖను ఆశ్రయించగా.. వల పన్నిన అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.శివకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. పట్టుబడ్డ అనంతరం ఎస్సై విపరీతంగా బాధ పడ్డారు. తన పరువు పోతుందని ఏడ్చేశారు. బల్లపై ముఖం దాచుకొని మరీ వెక్కివెక్కి ఏడ్చిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

Kranthi

Kranthi

Next Story