Jagitial Municipal Chairman: జగిత్యాల మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా.. సీల్డ్ కవర్‌లో అభ్యర్థి పేరు.. ఎవరికి దక్కనుందో ఆ ఛాన్స్?

Jagitial Municipal Chairman Seat: జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ భరితంగా మారింది.

Arun Chilukuri
Published on: 16 Feb 2026 11:01 AM IST
Jagitial Municipal Chairman: జగిత్యాల మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా.. సీల్డ్ కవర్‌లో అభ్యర్థి పేరు.. ఎవరికి దక్కనుందో ఆ ఛాన్స్?
X

Jagitial Municipal Chairman Seat: జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ భరితంగా మారింది. చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నప్పటికీ, ఆ కుర్చీలో కూర్చునే అభ్యర్థి ఎవరనే అంశంపై అధిష్ఠానం ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగిస్తోంది. అభ్యర్థి పేరును సీల్డ్ కవర్‌లో ఉంచడం ఇప్పుడు పట్టణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

అధిష్ఠానం కనుసన్నల్లోనే నిర్ణయం:

చైర్మన్ ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానం అత్యంత గోప్యత పాటిస్తోంది. కనీసం కీలక నేతలైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌లకు కూడా అభ్యర్థి ఎవరనే సమాచారం అందకపోవడం గమనార్హం. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇప్పటికే వాణి, జ్యోతి అనే ఇద్దరు కౌన్సిలర్ల పేర్లను అధిష్ఠానం ముందు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

నేతల మధ్య సయోధ్య:

అభ్యర్థి ఎవరైనప్పటికీ, అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని జీవన్ రెడ్డి మరియు సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. అయితే, చైర్మన్ మరియు వైస్ చైర్మన్ పదవులు ఏ వర్గానికి దక్కుతాయనే విషయంలో ఇరు వర్గాల అనుచరుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమ నాయకుడి ప్రతిపాదించిన వ్యక్తికే పదవి దక్కాలని ఇరు వర్గాలు ఆశిస్తున్నాయి. మరికాసేపట్లో సీల్డ్ కవర్ ఓపెన్ కానుండటంతో, జగిత్యాల కొత్త బాస్ ఎవరనేది తేలిపోనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story