రేవంత్‌రెడ్డిని తప్పించండి.. సోనియా, రాహుల్‌కు జగ్గారెడ్డి లేఖ

Jagga Reddy: సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలకు జగ్గారెడ్డి లేఖ రాశారు.

Arun Chilukuri
Updated on: 27 Dec 2021 8:06 PM IST
Jagga Reddy Writes Letter to Sonia Gandhi Against TPCC Chief Revanth Reddy
X

రేవంత్‌రెడ్డిని తప్పించండి.. సోనియా, రాహుల్‌కు జగ్గారెడ్డి లేఖ

Jagga Reddy: సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలకు జగ్గారెడ్డి లేఖ రాశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై జగ్గారెడ్డి ఫిర్యాదు చేశారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని మార్చాలని లేఖలో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పార్టీ నేతలను కలుపోకోపోకుండా వ్యక్తి గత ఇమేజ్ కోసం పాకులాడుతున్నాడని, పార్టీ నేతలతో చర్చించకుండా పార్టీ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేస్తున్నాడని జగ్గారెడ్డి ఆ లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

ఎర్రవల్లి ప్రోగ్రామ్ గురించి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న తనతో చర్చించలేదని జగ్గారెడ్డి ఆ లేఖలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. రేవంత్‌ పార్టీ కంటే వ్యక్తిగత ఇమేజ్ కోసం పని చేస్తున్నారని.. ఎవరితో చర్చించకుండా వ్యక్తిగత ప్రకటనలు చేస్తున్నారన్నారు. తన వైఖరి మార్చుకోవాలని చెప్పడానికి రేవంత్‌రెడ్డికి ఫోన్ చేసినా స్పందించలేదన్నారు జగ్గారెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story