Telangana: సీఎల్పీ కార్యాలయంలో అరుదైన దృశ్యం

Telangana: సీఎల్పీలో రేవంత్‌ ఎదురుపడగానే.. ఆప్యాయంగా పలుకరించిన జగ్గారెడ్డి

Rama Rao
Updated on: 11 March 2022 4:45 PM IST
Jagga Reddy Greeted Revanth Reddy at the CLP office
X

సీఎల్పీ కార్యాలయంలో అరుదైన దృశ్యం

Revanth Reddy-Jagga Reddy: వాళ్లిద్దరికీ ఒకరంటే ఒకరికి సుతరామూ గిట్టదు. ఒకరు మాత్రం మరొకర్ని అదను చిక్కినప్పుడల్లా విమర్శిస్తూ ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ వీడటానికి కారణం అతడేనంటూ బాహాటంగా చెప్పేస్తాడు. పై పొజిషన్లో ఉన్న వ్యక్తి మాత్రం అంతా పార్టీ చూసుకుంటుందంటూ బైటపడరు. ఇప్పటికే వారిద్దరూ ఎవరో మీకు అర్థమై ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి ఒకరైతే, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి మరొకరు.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనకు మర్యాద ఇవ్వడం లేదని పార్టీలో గుర్తింపు లేకుండా చేస్తున్నారంటూ ఏకంగా పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు జగ్గారెడ్డి. రేపే పార్టీ వీడతానంటూ రెండు వారాల కిందట ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద లెక్చర్లేచ్చారు. రేపు మాపాంటూ నెల రోజులు నన్చేశారు. కాంగ్రెస్ సీనియర్లు పార్టీ మారొద్దన్నారని హైకమాండ్ పెద్దలను కలిసొద్దమన్నారంటూ చెప్పి రాజీనామా వాయిదా వేస్తూ వచ్చాడు జగ్గారెడ్డి.

ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న తరుణంలో తాజాగా ఒక ఆసక్తికర ఘటన సీఎల్పీ కార్యాలయంలో జరిగింది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒకరినొకరు పలుకరించుకున్నారు. ఉప్పు-నిప్పుగా ఉండే ఇద్దరు నేతలు అలా ఎలా పలకరించుకోవడమేంటనేగా మీ డౌటు కానీ ఇది పచ్చి నిజం సీఎల్పీలో రేవంత్‌ ఎదురుపడగానే ఆప్యాయంగా పలుకరించారు జగ్గారెడ్డి. ఇద్దరు నేతలు 20 నిమిషాలకు పైగా రహస్యంగా చర్చించుకున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయ్. రేవంత్ పై తీవ్ర విమర్శలు చేశాక.. ఇప్పుడు రహస్య మంతనాలేంటన్న చర్చ పార్టీ నేతల్లో జోరుగా సాగుతోంది.

Rama Rao

Rama Rao

Next Story