Jagga Reddy: ప్రభుత్వం పట్టించుకోకుంటే ప్రగతిభవన్‌ ముందు దీక్ష చేస్తా

Jagga Reddy: తెల్లపూర్‌ మున్సిపాలిటీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్

Rama Rao
Published on: 4 Jan 2022 3:50 PM IST
Jagga Reddy Demands that the Problems of the Tellapur Municipality be Resolved
X

తెల్లపూర్‌ మున్సిపాలిటీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్

Jagga Reddy: సంగారెడ్డి జిల్లా తెల్లపూర్ మున్సిపాలిటీ ప్రజలు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంఘీభావం తెలిపారు. తెల్లపూర్‌ మున్సిపాలిటీ అభివృద్ధిని పట్టించుకోవడం లేదంటూ ప్రజలు, స్థానిక నేతలు, ఆటోడ్రైవర్లు రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నారు. తెల్లపూర్‌లోని మూడు చెరువులు కలుషితం అవుతున్నాయని పొల్యూషన్ లేకుండా చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తెల్లపూర్‌ గ్రామస్తుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుంటే ప్రగతి భవన్ ముందు దీక్ష చేస్తానని జగ్గారెడ్డి హెచ్చరించారు.

Rama Rao

Rama Rao

Next Story