logo
తెలంగాణ

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై క్రమశిక్షణా కమిటీకి జగ్గారెడ్డి ఫిర్యాదు

Jagga Reddy Complaint On TPCC Chief Revanth Reddy
X

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై క్రమశిక్షణా కమిటీకి జగ్గారెడ్డి ఫిర్యాదు

Highlights

Jagga Reddy: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై క్రమశిక్షణా కమిటీకి జగ్గారెడ్డి ఫిర్యాదు చేశారు.

Jagga Reddy: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై క్రమశిక్షణా కమిటీకి జగ్గారెడ్డి ఫిర్యాదు చేశారు. శశిథరూర్‌ను కించపరిచేలా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడం సరైనదేనా? అని ప్రశ్నించారు. ఫిర్యాదు ఇస్తున్నా.. రేవంత్‌రెడ్డికి షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చి వివరణ కోరాలన్నారు జగ్గారెడ్డి. రేవంత్‌ వ్యాఖ్యలపై ఎందుకు నోటీస్‌ ఇవ్వలేదు.. ఇది తప్పు కాదా?.. తాను ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే తప్పా? అని ప్రశ్నించారాయన. పార్టీలో రేవంత్‌రెడ్డి ఒంటెద్దు పోకడలు ప్రశ్నించడం తప్పా? అని నిలదీశారు. పార్టీలో సీనియర్‌ నాయకులకు గౌరవం ఇవ్వడంలేదని.. పార్టీ కార్యక్రమాలను తెలియజేయడం లేదన్నారు. ఇన్ని చేసిన రేవంత్‌ను క్రమశిక్షణా కమిటీ ప్రశ్నించదు కానీ.. తనను ప్రశ్నిస్తుందా? అని ఆవేదన వ్యక్తం చేశారు జగ్గారెడ్డి.

Web TitleJagga Reddy Complaint On TPCC Chief Revanth Reddy
Next Story