Sagar Bypoll: అందుకే జానారెడ్డిని ప్రజలు తిరస్కరించారు- జగదీష్ రెడ్డి

Sagar Bypoll: తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటుతో ఆకలి చావులు లేకుండా పోయాయన్నారు రాష్ర్ట మంత్రి జగదీష్ రెడ్డి.

Arun Chilukuri
Published on: 30 March 2021 3:14 PM IST
Jagadish Reddy slams Congress leader Jana Reddy
X

Sagar Bypoll: అందుకే 2018 ఎన్నికల్లో జానారెడ్డిని ప్రజలు తిరస్కరించారు- జగదీష్ రెడ్డి 

Sagar Bypoll: తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటుతో ఆకలి చావులు లేకుండా పోయాయన్నారు రాష్ర్ట మంత్రి జగదీష్ రెడ్డి. వ్యవసాయ రంగాన్ని పండగలా మార్చామన్నారు. నాగార్జుసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి జానారెడ్డి చేసిన అభివృద్ధి ఏమీలేదని అందుకే 2018లోనే ఆయనను ప్రజలు తిరస్కరించారన్నారు. ప్రచారం చేయనని చెప్పటంలోనే జానారెడ్డి పరోక్షంగా ఓటమిని అంగికరించినట్లు స్పష్టమవుతుందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో సాగర్ అభివృద్ధి కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుందని చెప్పారు. సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి మంచి మెజార్టీతో గెలుపొందటం ఖాయమని జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story