కేంద్రానికి లేఖలు రాయడం.. దొంగే దొంగ అన్నట్టుంది- Jagadish Reddy

Jagadish Reddy: జలదోపిడీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నీతులు మాట్లాడుతోందని విమర్శించారు మంత్రి జగదీష్‌రెడ్డి.

Arun Chilukuri
Updated on: 9 July 2021 6:47 AM IST
Jagadish Reddy Slams CM Jagan for Writing to Modi on Projects
X

కేంద్రానికి లేఖలు రాయడం.. దొంగే దొంగ అన్నట్టుంది- Jagadish Reddy

Jagadish Reddy: జలదోపిడీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నీతులు మాట్లాడుతోందని విమర్శించారు మంత్రి జగదీష్‌రెడ్డి. కేంద్రానికి లేఖలు రాయడం.. దొంగే దొంగ అన్నట్లుగా ఉందని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా నీటిని తీసుకెళ్తున్నారని, తక్షణమే జీవో 203ను వెనక్కి తీసుకొని, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాలని హెచ్చరించారు మంత్రి జగదీష్‌రెడ్డి. వరద జలాల పేరుతో శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లను ఇన్నాళ్లు అక్రమంగా తీసుకెళ్లారని, తెలంగాణ రైతుల ప్రయోజనాలకు భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోమని వార్నింగ్‌ ఇచ్చారు మంత్రి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story