Jagadish Reddy: బీజేపీ దుర్మార్గాలకు పరాకాష్ట ఆప్ నేత మనీశ్‌ సిసోడియా అరెస్ట్

* బీజేపీ కనుసన్నల్లో దర్యాప్తు సంస్థలు పని చేస్తున్నాయని విమర్శలు

Dhatripriya
Updated on: 27 Feb 2023 2:14 PM IST
Jagadish Reddy Comments On BJP And AAP
X

బీజేపీ దుర్మార్గాలకు పరాకాష్ట ఆప్ నేత మనీశ్‌ సిసోడియా అరెస్ట్

Jagadish Reddy: BJP పాలనలో ED, IT, CBI సంస్థలు తమ స్వాతంత్ర్యాన్ని కోల్పోయాయన్నారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి. BJP నేతల కోసమే కేంద్ర నిఘా సంస్థలు పనిచేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్ నాయకుడు మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడాన్ని జగదీష్ రెడ్డి ఖండించారు. దేశంలో ప్రస్తుతం ఎమర్జెన్సీకి మించిన దారుణమైన పరిస్థితులు కొనసాగుతున్నాయన్నారు. బిజెపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు అప్రజాస్వామికమని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు బిజెపి అరాచకాలు ఇలానే కొనసాగితే దేశ ప్రజల నుండి తిరుగుబాటు తప్పదన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story