IT Raids: పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి ఆఫీస్, నివాసాల్లో మూడో రోజు ఐటీ దాడులు

IT Raids: జనార్ధన్‌రెడ్డికి చెందిన జేసీ బ్రదర్స్ షోరూమ్స్‌తో పాటు.. అమీర్‌పేట్‌లోని కార్పొరేట్ ఆఫీసులో ఐటీ సోదాలు

Jyothi
Published on: 16 Jun 2023 8:48 AM IST
IT Raids on the offices and Residences of Pailla Shekar Reddy and Marri Janardhan Reddy for the Third Day
X

IT Raids: పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి ఆఫీస్, నివాసాల్లో మూడో రోజు ఐటీ దాడులు

IT Raids: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి ఆఫీస్, నివాసాల్లో మూడో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. జనార్ధన్‌రెడ్డికి చెందిన జేసీ బ్రదర్స్ షోరూమ్స్‌తో పాటు అమీర్‌పేట్‌లోని కార్పొరేట్ ఆఫీసులో ఇన్‌ట్యాక్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. జేసీ స్పిన్నింగ్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేసీ బ్రదర్స్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, మర్రి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో మర్రి జనార్ధన్ రెడ్డి వ్యాపారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.. అలాగే పైళ్ల శేఖర్‌రెడ్డికి సంబంధించిన ఆఫీస్, నివాసాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.. ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది..శేఖర్‌రెడ్డి సంస్థలు దక్షిణాఫ్రికాలో మైనింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

హిల్‌ల్యాండ్ టెక్నాలజీస్, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్‌లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.. ఈ రెండు కంపెనీలకు శేఖర్‌రెడ్డి భార్య వనిత డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. అలాగే పైళ్ళ శేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న తీర్థ గ్రూప్‌ సంస్థలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

Jyothi

Jyothi

Next Story