Top
logo

IT Raids: హెటిరోలో తవ్వేకొద్దీ బయటపడుతున్న నోట్ల కట్టలు

IT Raids on Hetero Drugs Offices in Hyderabad
X

హెటిరోలో తవ్వేకొద్దీ బయటపడుతున్న నోట్ల కట్టలు (ఫైల్ ఇమేజ్)

Highlights

IT Raids: హెటిరోకు సంబంధించి 16 ప్రైవేట్ లాకర్లు తెరిచిన అధికారులు

IT Raids: దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన హెటిరో డ్రగ్స్ అక్రమాల పుట్టలో తవ్వేకొద్దీ నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. ఈ కేసులో అధికారులు ఇప్పటి వరకూ 16 లాకర్లను తెరిచారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్, సికింద్రాబాద్, శ్రీనగర్ కాలనీలోని లాకర్లను తెరిచినట్లు తెలుస్తోంది. ఈ లాకర్లలో పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 16 ప్రైవేట్ లాకర్లు తెరిచిన ఐటీ అధికారులు.

ఒక్కొక్క అల్మరాలో కోటిన్నర నుంచి రెండు కోట్ల స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం అల్మరాల్లో దాదాపు 30 కోట్ల రూపాయలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆరు రోజుల ఐటీ దాడుల్లో ఇప్పటి వరకూ 172 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ అధికారులు తెలిపారు. ఇదే సమయంలో 550 కోట్ల అనుమానిత లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తుండగా 20వ తేదీ లోపు తమ ఎదుట హాజరవ్వాలని నోటీసులిచ్చారు.


Web TitleIT Raids on Hetero Drugs Offices in Hyderabad
Next Story