Hyderabad: గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ పేలుళ్లకు 14 ఏళ్లు

గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ పేలుళ్లకు 14 ఏళ్లు (ఫైల్ ఫోటో)
* 2007 ఆగస్టు 25న హైదరాబాద్‌లో జంట పేలుళ్లు * జంట పేలుళ్లలో 44 మంది మృతి * వందలాది మంది క్షతగాత్రులు
Hyderabad: హైదరాబాద్ మహానగరంతో పాటు దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసిన గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ జంట పేలుళ్ల దుర్ఘటనకు నేటితో 14 ఏళ్ళు పూర్తయ్యాయి. 2007 ఆగస్టు 25న కోఠిలోని గోకుల్ చాట్, సచివాలయానికి ఎదురుగా ఉన్న లుంబినీ పార్కులో కొద్ది సమయం తేడాలో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో మొత్తం 44 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. బాంబుల్లో వినియోగించిన ఇనుప ముక్కల ధాటికి చాలామంది శరీర అవయవాలు కోల్పోయి జీవచ్ఛాలుగా మారిపోయారు.
ఇండియన్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థ ఈ దారుణానికి పాల్పడింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో న్యాయస్థానంలో ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసు విచారణ కోసం చర్లపల్లి న్యాయస్థానంలో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేశారు. అన్ని ఆధారాలను పరిశీలించిన స్పెషల్ కోర్టు అనిక్ షఫిక్ సయ్యద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి అనే ఉగ్రవాదులను దోషులుగా నిర్ధారిస్తూ మరణశిక్ష విధించింది. వీరికి ఆశ్రయం ఇచ్చిన తారిఖ్ అంజుమాకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
TS EAMCET: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..
12 Aug 2022 6:14 AM GMTప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMT
జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో విషాదం
13 Aug 2022 4:09 AM GMTమునుగోడులో హై వోల్టేజ్ రాజకీయాలు
13 Aug 2022 3:45 AM GMTMilk Facts: పాలు తాగితే బరువు పెరుగుతారా.. తగ్గుతారా..!
13 Aug 2022 3:17 AM GMTకాంగ్రెస్‌లో ఆపరేషన్ మునుగోడు ప్రారంభం
13 Aug 2022 2:32 AM GMTఅక్కపై తమ్ముడి విలువైన ప్రేమ
13 Aug 2022 2:04 AM GMT