KCR Delhi Tour: సార్ సక్సెసా? ఫెయిలా?

KCR Delhi Tour: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ఏమీ సాధించకుండానే హైదరాబాద్ తిరిగొచ్చారా?

Arun Chilukuri
Published on: 24 May 2022 5:47 PM IST
is CM KCR Delhi Tour Success or Fail
X

KCR Delhi Tour: సార్ సక్సెసా? ఫెయిలా?

KCR Delhi Tour: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ఏమీ సాధించకుండానే హైదరాబాద్ తిరిగొచ్చారా? 30వ తేదీ వరకు నేషనల్ పాలిటిక్స్‌ ఇష్యూలో సీఎం కేసీఆర్ బిజీ షెడ్యూల్ ఉందనే ప్రచారం జరగ్గా వెంటనే ఎందుకు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారనే దానిపై పొలిటికల్ రూమర్లు స్ప్రెడ్ అవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 26వ తేదీన హైదరాబాద్ వస్తుండగా సీఎం కేసీఆర్ ఆయన్ని కలుస్తారా లేదా అనే ఉత్కంఠ కూడా నెలకొంది.

సమతామూర్తి విగ్రహావిష్కరణ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కలువకపోవడం రాజకీయంగా దుమారం రేపింది. అలాగే తాజాగా 26న ప్రధానమంత్రి హైదరాబాద్ షెడ్యూల్ ఉండగా అదే రోజు కేసీఆర్ బెంగళూరు టూర్ వెళ్తున్నారు. ఢిల్లీ టూర్ నుంచి కేసీఆర్ తిరిగిరావడం, హస్తిన నుంచి హైదరాబాద్‌కు నరేంద్ర మోడీ వస్తుండటం, అదే సమయంలో కేసీఆర్ కర్నాటక వెళ్తుండటం అన్ని పొలిటికల్ ఉహాగానాలకు తావిస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story