ఆదిభట్ల యువతి కిడ్నాప్‌ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

* కిడ్నాప్‌నకు వాడిన నవీన్‌రెడ్డి వోల్వో కారు లభ్యం

R Tripura Malini
Published on: 13 Dec 2022 12:52 PM IST
Investigation Is On Going In Hyderabad Woman Kidnap Case
X

ఆదిభట్ల యువతి కిడ్నాప్‌ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

Hyderabad: ఆదిభట్ల యువతి కిడ్నాప్‌ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. కిడ్నాప్‌నకు నవీన్‌రెడ్డి వాడిన వోల్వో కారు లభ్యమైంది. నవీన్‌రెడ్డి సన్ ఆఫ్ కోటిరెడ్డి పేరుపై వోల్వో కారు రిజిస్టర్‌ అయినట్లు పోలీసులు గుర్తించారు. వోల్వో కారులో యువతిని తీసుకెళ్లి నల్గొండ శివారులో నవీన్‌రెడ్డి వదిలేశాడు. ఆ తర్వాత శంషాబాద్‌లోని తొండుపల్లి వద్ద కారును వదిలి పరారయ్యాడు నవీన్‌రెడ్డి. దీంతో నవీన్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఇదే కారులో గతంలో వైశాలి ఇంటి వద్ద నవీన్ రెడ్డి హంగాగా చేస్తూ హడావుడి సృష్టించాడు.

R Tripura Malini

R Tripura Malini

Next Story