Rega Kantha Rao: ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆసక్తికర పోస్ట్

Rega Kantha Rao: ఇవాళ పెద్దసార్‌ ప్రెస్‌మీట్‌ ఉంటుందని పోస్ట్

Rama Rao
Published on: 28 Oct 2022 1:08 PM IST
Interesting FacebookPost by MLA Rega Kantha Rao | Telugu News
X

Rega Kantha Rao: ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆసక్తికర పోస్ట్

Rega Kantha Rao: ఎమ్మెల్యేల ఎర ఇష్యూ కొనసాగుతున్న వేళ.. రేగా కాంతారావు చేసిన ఓ పోస్ట్‌ ఆసక్తి రేపుతోంది. ఇవాళ పెద్దసార్‌ ప్రెస్‌మీట్‌ ఉంటుందంటూ.. ఎమ్మెల్యే రేగా కాంతారావు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ పెట్టారు. అయితే.. నిన్ననే మంత్రి కేటీఆర్‌ ఫామ్‌హౌస్‌ వ్యవహారంపై నేతలెవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. ఇవాళ రేగా కాంతారావు చేసిన పోస్ట్.. ఆసక్తికరంగా మారింది. ఆపరేషన్‌ ఎరలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలలో రేగా కాంతారావు ఒకరు. మూడు రోజుల నుంచి ఎమ్మెల్యేలు నలుగురు ప్రగతిభవన్‌లోనే ఉన్నారు. నిన్న ముగ్గురు నిందితుల కస్టడీకి ఏసీబీ జడ్జి నిరాకరించారు. నగదు ఆధారాలు లేనందున కేసును 41 సీఆర్‌పీసీ కింద నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ పరిణామాల అనంతరం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ ఉంటుందని రేగా కాంతారావు పోస్ట్ పెట్టడం హాట్‌టాపిక్‌ అయింది. ప్రెస్‌మీట్‌లో కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు బయటపెడతారని ఆసక్తికర చర్చ జరుగుతోంది.


Rama Rao

Rama Rao

Next Story