జగ్గారెడ్డి, కేటీఆర్ మధ్య ఆసక్తికర చర్చ.. మావోళ్లని బాగా చూసుకో జగ్గన్నా అంటూ..

KTR: సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 16 Dec 2021 5:17 PM IST
Interesting Discussion Between Jaggareddy and KTR
X

జగ్గారెడ్డి, కేటీఆర్ మధ్య ఆసక్తికర చర్చ.. మావోళ్లని బాగా చూసుకో జగ్గన్నా అంటూ..

KTR: సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మంత్రి కేటీఆర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. వెజ్ నాన్ వెజ్ మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఒకరికొకరు ఎదురుపడిన ఇద్దరు నేతలూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. మా ఎంపీలు, ఎమ్మెల్యేలను జాగ్రత్తగా చూసుకోవాలంటూ కేటీఆర్ ఛలోక్తి విసరగా మీరు మంత్రి మీరే మమ్మల్ని చూసుకోవాలి అంటూ జగ్గారెడ్డి ప్రతిస్పందించారు.

ఆ తర్వాత కార్యక్రమంలో భాగంగా స్టేజ్ పై కూడా ఈ ఇద్దరు నేతలు పక్క పక్కనే కూర్చుని ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. కేటీఆర్, జగ్గారెడ్డి మధ్య ఈ సానిహిత్యంపై చుట్టుపక్కల నేతల్లోనే కాదు రాజకీయ వర్గాల్లోనూ ఓ రేంజ్ లో చర్చనీయాంశమైంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story