Inspired story auto driver: మనోధైర్యంతో అడుగు ముందుకు...

Inspired story auto driver: మనోధైర్యంతో అడుగు ముందుకు...
x
Highlights

Inspired story auto driver: ఎంతో మంది యువత అన్ని అవయవాలు ఉండి కూడా పని చేయడానికి బద్దకిస్తూ ఉంటారు

Inspired story auto driver: ఎంతో మంది యువత అన్ని అవయవాలు ఉండి కూడా పని చేయడానికి బద్దకిస్తూ ఉంటారు. మరి కొంత మంది వికలాంగులు అయికూడా ఏదో పనిచేయాలని, ఏదో సాధించాలని అనుకుంటూ ఉంటారు. కానీ కొంత మంది దివ్యాంగులు మేము ఏం చేయలేకపోతున్నామే అనుకుంటూ వారిలో వారే మదనపడుతూ ఉంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం తనకు ఒక కాలు లేకపోయినప్పటికీ ఒకరి మీద ఆధారపడి బతకడం ఇష్టం లేకుండా ఏదో ఒక పనిచేయాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే ఒంటి కాలితో ఆటో నడుపుకుంటూ ఆటోనడుపుతూ ప్రయాణికులను గమ్యస్థానాలుకు చేరుస్తూ జీవనం సాగిస్తున్నాడు.

అసలు ఎవరితను ఏంటి ఇతని గాధ ఇప్పుడు తెలుసుకుందాం.. పాల్వంచ మండలం సోములగూడెం గ్రామానికి చెందిన బోగి ఉపేందర్‌ దివ్యాంగుడు. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇతను 2010 మార్చి28న పాల్వంచ లో పాలుపోసేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా లక్ష్మీదేవిపల్లిలోని పెట్రోల్‌ బంక్‌ సమీపంలో భద్రాచలం జాతీయ రహదారిపై ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. ఆ ప్రమాదంలో ఉపేందర్ చావునుంచి బయటపడినప్పటికీ కుడి కాలును మాత్రం కోల్పోయాడు. రోడ్డు ప్రమాదంలో కాలు పూర్తిగా నుజ్జునుజ్జవడంతో వైద్యులు మోకాలి వరకు తొలగించారు. కాగా అతను కొద్ది రోజుల వరకు తన భవిష్యత్తుగురించి. తన కుటుంబం గురించి ఆలోచిస్తూ దిగాలు చెందేవాడు.

కొద్ది రోజుల తరువాత తనలో తాను ధైర్యం తెచ్చుకున్నాడు. ఇలా ఖాళీగా ఉండొద్దని భావించి ఆటో నడపాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఓ ఆటోను కొనుగోలు చేసి ఆలోనడిపించడం ప్రారంభించాడు. ఇప్పుడు వస్తున్న కొత్త ఆటోల్లో చేతిలో క్లచ్‌ ఉండడంతో అతనికి డ్రైవింగ్‌ ఇబ్బందిగా మారలేదు. దీంతో అతను ఎవరి నుంచి సహాయం తీసుకోకుండానే ప్రతిరోజూ అన్ని పనులూ తానే చేసుకుంటూ..ఆటో నడుపుకుంటూ ముందుకు సాగుతున్నాడు. భద్రంగా డ్రైవింగ్‌ చేస్తానని, అతివేగంగా అస్సలే వెళ్లనని, ఆటోలో కూర్చున్న వారిని సురక్షితంగా చేరవేస్తానని అంటున్నాడు. ఉదయం ఇంటి నుంచి వెళ్లి..సాయంత్రానికి తిరిగి వచ్చేస్తానని చెపుతున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories