సింగరేణి ఎన్నికలపై విచారణ వాయిదా

High Court: ఈ నెల 21కి విచారణ వాయిదా వేసిన హైకోర్టు

Jyothi
Published on: 18 Dec 2023 11:42 AM IST
Inquiry on Singareni Election Adjourned
X

సింగరేణి ఎన్నికలపై విచారణ వాయిదా

High Court: సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని ఇంధనశాఖ పిటిషన్ దాఖలు చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న ఎన్నికలు జరగాల్సి ఉండగా.. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అధికారం చేపట్టడం, ఇతర కారణాల దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు ఇంధనశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ. మార్చి నెలాఖరుకు ఎన్నికలు వాయిదా వేయాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా వేసింది.

Jyothi

Jyothi

Next Story